గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో మెయిన్ రోడ్డులోని జనార్ధన స్వామి గుడిలో దొంగతనం జరిగింది. దొంగలు అర్థరాత్రి గుడి తాళాలు పగలకొట్టి స్వామి, అమ్మవారి వెండి కిరీటాలు, బంగారు అభరణాలు దొంగిలించారు. వీటి విలువ సమారుగా ఒక లక్ష యాభై వేలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు