ETV Bharat / state

ఈ శుభలేఖకు 96 ఏళ్లు

author img

By

Published : Dec 28, 2020, 1:16 PM IST

పరిణయవేడుకలో ప్రతీదీ ప్రత్యేకమే. ప్రతి ఘట్టం మధుర జ్ఞాపకమే. అందులో శుభలేఖలు కూడా ఓ అంశం. వాటిని ఫ్రేములు కట్టించి జాగ్రత్త చేయటం ఈ రోజుల్లో సాధారణం.. కానీ గుంటురులోని ఘంటసాలకు చెందిన ఓ వ్యక్తి 96 ఏళ్ల తమ తాత-నాయనమ్మ వివాహ ఆహ్వాన పత్రికను అపురూపంగా భద్రపరిచాడు.

wedding card
శుభలేఖ

గుంటూరు మండల కేంద్రం ఘంటసాలలో రైతు కుటుంబానికి చెందిన వేమూరి బాబూ రాజేంద్రప్రసాద్‌ ‘తాత-నాయనమ్మ’(వెంకట సుబ్బారావు- అన్నపూర్ణమ్మ)ల వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయన ముత్తాత వేమూరి వెంకట్రామయ్య ముద్రింపజేశారు.

wedding card
శుభలేఖ

ఆ శుభలేఖను తీపి గుర్తుగా ఆస్తి దస్తావేజులులా గత 96 సంవత్సరాలుగా భద్రంగా దాస్తున్నారు బాబూ రాజేంద్రప్రసాద్‌. అలాగే ఆయన తండ్రి - తల్లి (వేమూరి పరాత్పరరావు-రాధమ్మ) వివాహమహోత్సవ పత్రికను సైతం 64 ఏళ్లుగా భద్రపరచడం విశేషం.

ఇదీ చదవండి:

ఆరోగ్యంగా ఉండేందుకు..యాప్​ల వాడకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.