ETV Bharat / state

'ఇలాంటి సమయంలోనూ కక్కుర్తి పడతారా?' - ఏపీ కరోనా అప్​డేట్స్

కరోనా నివారణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కరోనాపై పోరులో మొదట్నుంచీ అనేక తప్పులు చేశారని మండిపడ్డారు. వైరస్​పై ఇప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దని హితవు పలికారు.

chandra babu
chandra babu
author img

By

Published : Apr 21, 2020, 3:24 PM IST

మీడియాతో చంద్రబాబు

కరోనా భయంకరమైన వైరస్‌... దానికి నివారణే తప్ప మరో మార్గం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మహమ్మారిని తక్కువ అంచనా వేయొద్దని, కప్పి పుచ్చే ప్రయత్నం చేయవద్దని మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు.

‘‘మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిన్న కేసులు పెరిగాయి. మేం చెప్పేదాన్ని మీరు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో చెలగాటం వద్దు. ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రెడ్‌ జోన్‌లు ఉన్నాయి. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప కరోనాను నివారించలేం. వైద్యులు, సిబ్బందికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వైద్యులకు మాస్క్‌లు, పీపీఈలు ఇస్తున్నారా? కరోనాపై క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే వారిని మనం రక్షించుకోవాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అనేక సార్లు కోరాం... అయినా పట్టించుకోలేదు’’ అని చంద్రబాబు విమర్శించారు.

ఇప్పుడు ఎన్నికలపై ఎవరైనా మాట్లాడతారా?

‘‘కరోనాపై పోరులో మొదటి నుంచి అనేక తప్పులు చేశారు. విపక్షనేతలు ఏం మాట్లాడినా ఎదురుదాడి చేస్తున్నారు. ఇది తప్పు అని ఎవరైనా నోరు తెరిస్తే కేసులు పెడతారా? ఇది చాలా బాధాకరం. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్​ రూ.350కు టెస్టింగ్‌ కిట్‌ తెచ్చుకుంటే.. ఏపీలో మాత్రం రూ.730 చొప్పున కరోనా టెస్టింగ్‌ కిట్‌ కొనుగోలు చేశారు. పట్టుబడిన తర్వాత ధర తగ్గుతుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా కక్కుర్తి పడతారా?. రైతులను ఆదుకుంటామని నిత్యం ప్రకటనలు ఇస్తున్నారు. ఆక్వా, పౌల్ట్రీ రైతులు బాగా దెబ్బతిన్నారు. పంట నష్టంతో పలు చోట్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు చనిపోతున్నారంటే అర్థం ఏమిటి?. పరిస్థితి ఇలా ఉంటే ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడతారా? ఇలాంటి సమయంలో ఆర్డినెన్స్‌ ఇచ్చి ఎస్‌ఈసీని తీసేస్తారా? కరోనా ఆంక్షల మధ్య తమిళనాడు నుంచి కనగరాజ్‌ను ఎలా తీసుకువచ్చారు. మీ తిట్లకు భయపడేది లేదు.. మరిన్ని సూచనలు చేస్తాం. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉంటే కొందరికి ఆహారం దొరికేది. కరోనా నివారణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి. బయట్నుంచి వచ్చిన వారిని తప్పకుండా క్వారంటైన్‌కు పంపాలి. 14 నుంచి 25 రోజుల్లోగా ఎప్పుడైనా వైరస్‌ బయటపడుతోంది. కేరళలో రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించారు. ఏకపక్షంగా ముందుకెళ్లలేరు. అందరితో కలిసి పని చేయాలి’’ అని చంద్రబాబు సూచించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో 757కు చేరిన కరోనా కేసులు...మరో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.