గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం మేడికొండూరు మండలంలో వలస కూలీలు వసతి గృహాల్లో ఉంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరంతా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ పనులు, క్రషర్లు, వివిధ కర్మాగారాల్లో పని చేసేందుకు వచ్చిన వీరంతా.... కరోనా మహమ్మారి కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ కారణంతో పనులు లేక ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
తమకు ప్రస్తుతం ప్రభుత్వం అందించే సాయం ఏ మాత్రం సరిపోవడంలేదని ఆవేదన చెందారు. దాతలు అందిస్తున్న సాయం అంతంత మాత్రంగానే ఉందని వాపోయారు. ఉపాధి లేక పస్తులు ఉండే పరిస్థితి ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. తమకు సొంతూళ్లకు వెళ్లే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: