గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారం గ్రామానికి చెందిన కటారి రాఘవేంద్ర రావును... రేపల్లె పట్టణంలోని దుకాణ యజమానులను బెదిరించి నగదు వసూలు చేస్తున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం రాఘవేంద్ర అస్వస్థతకు గురికాగా... చికిత్స నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మృతి చెందాడు. ఈ ఘటనపై బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి అనారోగ్యం కారణంగానే రాఘవేంద్ర మృతి చెందాడని నిర్థరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: