పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు(Amravati Farmers concern)... 646వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, పెదపరిమి, దొండపాడు, నెక్కల్లు, వెలగపూడి, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
వాణిజ్య ఉత్సవ్ పేరుతో నిర్వహించిన సమ్మిట్లో రాజధానిలో ఒక్క ప్రాజెక్టునైనా తీసుకొచ్చారా అని రైతులు ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన అన్ని సమ్మిట్ లలోనూ అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చేవన్నారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టకుండా ఎన్ని ఉత్సవ్ లు నిర్వహించినా ప్రయోజనం ఉండదన్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజధాని అభివృద్ధి కోసం పెద్దఎత్తున ఎంవోయూలు చేసుకుంటుంటే ఇక్కడి ముఖ్యమంత్రి ఉన్న వాటిని ప్రైవేటు పరం చేసేందుకు ఉత్సాహ పడుతున్నారని రైతులు విమర్శించారు.
ఇదీ చదవండి