ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ యాచకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నరసింహ, అంకమ్మ అనే ఇద్దరు ఫిరంగిపురం బస్‌స్టాప్ వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో నరసరావుపేటకు చెందిన మస్తాన్‌వలి ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్తూ వీరిని ఢీ కొట్టాడు.
ఈ ప్రమాదంలో నరసింహకు తీవ్ర గాయాలు కాగా.. అంకమ్మకు స్వల్పగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరసింహ సోమవారం మృతి చెందాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫిరంగిపురం పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి..
అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు