Tension in Lets Metro for CBN: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో.... ఐటీ ఉద్యోగులు మళ్లీ గళమెత్తారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు...లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించి మెట్రోరైలులో ఎక్కగా పోలీసులు బవవంతంగా దించేయడం పలు స్టేషన్లలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిరసన: చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ..... హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు నిరసన తెలిపారు. బాబుకు బాసటగా...లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. బాబును విడుదల చేయాలంటూ... మహిళలు, ఐటీ ఉద్యోగులు మియాపూర్ నుంచి ఆయా స్టేషన్లలో మెట్రో ఎక్కారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబుకు.. ఏంటీ దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాబును జైల్లో పెట్టడమంటే అభివృద్ధికి సంకెళ్లు వేయడమేనని ఆక్రోశించారు.
Samata Sainik Dal Fires on CM Jagan: జగన్‌కు ఓట్లు వేసి.. మా గొంతు మేమే కోసుకున్నాం: సమతా సైనిక్ దళ్
స్టేషన్లలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు: ఐటీ ఉద్యోగుల నిరసనపై మెట్రో స్టేషన్ల వద్ద.. పోలీసులు ఆంక్షలు విధించారు. నల్ల దుస్తులు ధరించిన స్టేషన్లలోకి రాకుండా అడ్డుకున్నారు. ఫ్లాట్ ఫాంలపైనా తనిఖీలు చేశారు. అమీర్ పేట్‌లో.. మెట్రోలో ప్రయాణిస్తున్న వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నల్ల వస్త్రాలు ధరించిన వారిని బలవంతంగా బయటకు పంపేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. భరత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, ఎంజీబీఎస్ వద్ద మెట్రోను నిలిపివేసిన పోలీసులు, ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.
నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు: చంద్రబాబుపై వైసీపీ సర్కారు కక్షసాధిస్తుందని, తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు బాసటగా లక్డీకపూల్‌లో మెట్రోలో ప్రయాణించారు. లెట్స్ మెట్రో ఫర్ CBN' కారక్రమంలో చిన్నారులు బాబుతో మేము సైతం అంటూ గళం విప్పారు. మియాపూర్ స్టేషన్‌లో ఐటీ ఉద్యోగుల నిరసనకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు.. మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీదేవిని కూడా పోలీసులు వాహనం ఎక్కించేందుకు పోలీసులు యత్నించారు.
బలవంతంగా అరెస్ట్: ఎల్బీనగర్ నుంచి తిరిగి మియాపూర్ వెళ్లేందుకు యత్నించిన ఐటీ ఉద్యోగులకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వారికి టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ మైదానం వరకు ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీశారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. అప్పటికే ఐటీ ఉద్యోగులను ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వారు వినలేదు. నిరసనకారులను బలవంతంగా అరెస్టుకు చేసేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.