గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యువతి హత్యను నిరసిస్తూ.. గుంటూరు జీజీహెచ్ వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. శవ పరీక్ష పూర్తైన రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యుల యత్నించగా.. ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. రమ్య కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని.. రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి వెనుక ద్వారం నుంచి పోలీసులు ఆమె స్వగ్రామం చిలుమూరు తరలించారు.
రూ.10 లక్షలు ఆర్థిక సాయం..
రమ్య కుటుంబ సభ్యులను జీజీహెచ్లో హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపును రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అందుకు సంబంధించిన చెక్కును రమ్య కుటుంబ సభ్యులకు హోం మంత్రి అందించారు.
పట్టపగలే..నడిరోడ్డుపై..
పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇదీ చదవండి