ఇసుక కొరత నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక సరఫరా అందుబాటులోకి తీసుకురాని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీచదవండి