ETV Bharat / state

‘ఖాళీ’లతో పోరాటం.. కరువైన సదుపాయాలు.. ఇది తెలంగాణలోని అగ్నిమాపక శాఖ దుస్థితి

Vacancies in Telangana Fire Department : కాలంతో సంబంధం లేకుండా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. భరోసా ఇవ్వాల్సిన అగ్నిమాపక విపత్తు నివారణ శాఖ సమస్యలతో సతమతమవుతోంది. ఫైర్‌ ఇంజిన్లే కాదు.. వాటిని నడపాల్సిన డ్రైవర్లు కూడా తగినంతమంది లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉన్న అరకొర సదుపాయాలతోనే నెట్టుకొస్తున్నారు. తాజా ఘటనతో మరోమారు ఆ శాఖ సామర్థ్యం చర్చనీయాంశంగా మారింది.

Vacancies in Telangana Fire Department
Vacancies in Telangana Fire Department
author img

By

Published : Jan 20, 2023, 9:38 AM IST

Vacancies in Telangana Fire Department : తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న అగ్నిప్రమాదాలు భయపెడుతున్నా.. భరోసా ఇవ్వాల్సిన అగ్నిమాపక విపత్తు నివారణ శాఖ సమస్యలతో సతమతమవుతోంది. మంటలార్పేందుకు ఫైర్‌ ఇంజిన్లే కాదు.. వాటిని నడపాల్సిన డ్రైవర్లు కూడా తగినంతమంది లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉన్న అరకొర సదుపాయాలతోనే నెట్టుకొస్తున్నారు.

ఒకేసారి రెండు, మూడు ప్రమాదాలు జరిగితే దేవుడి మీద భారం వేయడం మినహా గత్యంతరం లేదంటే అతిశయోక్తికాదు. సికింద్రాబాద్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆ శాఖ సామర్థ్యం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వేసవికాలంలోనే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగేవి. కానీ, ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

అగ్నిమాపక శాఖ లెక్కల ప్రకారం 2021లో రాష్ట్రంలో 7,327 ప్రమాదాలు జరిగాయి. 2022కు సంబంధించి లెక్కలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రమాదాలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలు.. ఒకవేళ జరిగితే ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ఆ శాఖలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. కానీ, అవి ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ఉదాహరణకు సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో గత ఏడాది సెప్టెంబరులో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మరణించారు. పైన లాడ్జి ఏర్పాటు చేసి సెల్లార్‌లో విద్యుత్తు ద్విచక్రవాహనాల దుకాణం పెట్టారు. వాటి ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగినట్లు ఆ ప్రమాదంతో తేటతెల్లమెంది.

అరకొర వసతులు, సిబ్బందితో నెట్టుకొస్తున్న అగ్నిమాపక శాఖ: రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఇలాంటి ఉల్లంఘనలే బయటపడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. అగ్నిమాపక శాఖ సామర్థ్యంపై అనేక అనుమానాలున్నాయి. ఈ శాఖకు 134 ఫైర్‌ ఇంజిన్లు ఉండగా.. వాటిలో 50 ఇంజిన్లు 15 ఏళ్ల కిందటివే. అలానే 209 ట్యాంకర్లు ఉండగా.. వాటిలో 48 ట్యాంకర్లు 15 సంవత్సరాలకు పైబడినవే. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలు ఉపయోగించకూడదు.

కానీ, గత్యంతరం లేక వీటితోనే నెట్టుకొస్తున్నారు. ఇవి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. అంతేకాదు.. ప్రస్తుతం అగ్నిమాపకశాఖకు మంజూరైన ఫైర్‌మెన్‌ ఉద్యోగాల సంఖ్య 1,326 కాగా వాటిలో 582 ఖాళీగా ఉన్నాయంటే ఆ శాఖ దీనస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇక డ్రైవర్ల పోస్టులయితే మరింత దారుణం. 393కిగాను 216 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అరకొర వసతులు, సిబ్బందితో ఆ శాఖ నెట్టుకొస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.