Tamilisai treated an Injured Young man: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు ఆమె వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది గమనించిన ఆమె కారును ఆపి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. ఆస్పత్రి వారితో గవర్నర్ మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అనంతరం గవర్నర్ తమిళిసై హైదరాబాద్‌కు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించగలిగితే ప్రాణాలు నిలబెట్టినవారిమవుతామని గవర్నర్ సూచించారు.
ఇటు తెలంగాణ గవర్నర్‌గానే కాకుండా అటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తన బాధ్యలు కొనసాగిస్తూ.. ఎప్పుడు సామాజిక అంశాల్లో ముందుంటారు తమిళిసై. డాక్టర్ వృత్తిపట్ల ఆమెకు ఉన్న అనుభవంతో ఎక్కడికి వెళ్లినా తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైనప్పుడు చికిత్స చేయడానికి ముందుకొస్తారు. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆమె తన హోదానే మరిచి క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు సాయం చేయడానికి చూస్తారు.
ఇవీ చదవండి: