తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తలకు గాయమైంది. గుంటూరు జిల్లా తెనాలిలోని తన ఇంటి ఆవరణలో జారి పడ్డారు. వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లోకి వస్తుండగా తడి రాళ్లపై కాలు వేయబోయి.. జారిపడగా ఆమె తల గోడకు తగిలి గాయమైంది.
గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైన చోట వైద్యులు కుట్లు వేశారు. గాయం చిన్నదేనని.. పెద్దగా ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం తెనాలిలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నన్నపనేని ఆరోగ్యంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరా తీశారు.
ఇదీ చదవండి: