గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక రహదారిలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద తెదేపా నేతలు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదల కడుపు కొట్టాలనే ఉద్దేశ్యంతోనే వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేసిందని విమర్శించారు. అన్న క్యాంటీన్ పేరు నచ్చకపోతే, రాజన్న క్యాంటీన్‌గా పేరు మార్చి పేదవాడి కడుపు నింపాలని బాపట్ల తేదేపా ఇంచార్జ్ వేగేశాన నరేంద్రవర్మ సూచించారు.
ఇవీ చూడండి...