మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటు.. రాజధాని అమరావతికి వేసే ఓటుగా భావించాలని తెదేపా అధికార ప్రతినిధి దివ్యావాణి అన్నారు. గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రచార ఆర్భాటాలు తప్ప.. అభివృద్ధి శూన్యమని అన్నారు. మంత్రులు నానిలు భూతులు మాట్లాడితే.. తెదేపా నేత కోవెలమూడి నాని అభివృద్ధి చేసే వ్యక్తి అని అన్నారు.
ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉందని మండిపడ్డారు. అమరావతి మహిళలు, రైతులు కన్నీరు చూస్తుంటే.. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మనసు రావడం లేదన్నారు. జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే.. పుర ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: