విశాఖ రైల్వే జోన్ ప్రకటన వెనక మోసం స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సమయంలో విశాఖ జోన్ ప్రకటన చేయడం ప్రజల వ్యతిరేకతను తగ్గించుకోడానికేనని అన్నారు. వాల్తేరు డివిజనులో ఆదాయ మార్గాలను కొత్త జోన్ పరిధిలోకి తీసుకురాకపోవడం మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో భాగమే రైల్వేజోన్:ఎంపీ రాయపాటి
రాష్ట్రానికి రైల్వే జోన్ ప్రకటించడం సంతోషకరమే అయినా..నిధులు ప్రకటించకపోవడం బాధాకరమని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు . ఎన్నికల హడావుడిలో భాగంగానే రైల్వే జోన్ ప్రకటించినట్లు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి తీసుకున్నారో..లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖలో మోదీ పర్యటన ఉన్నందున...ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారనే భయంతో జోన్ ప్రకటించినట్లు అభిప్రాయపడ్డారు.