తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో జగన్మోహన్రెడ్డి కీలుబొమ్మ:ఎమ్మెల్సీ అశోక్‌బాబు దుమ్ముగూడెం నుంచి నీటి సరఫరాను ఒకప్పుడు వ్యతిరేకించిన తెరాస పార్టీతో ఇప్పుడు ఏ విధంగా నాగార్జున సాగర్‌కు నీటిని నల్గొండ నుంచి రప్పించటానకి ఒప్పుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అశోక్‌బాబు. దుమ్ముగూడెం నుంచి నల్గొండ మీదుగా నీటిని తీసుకురావటం అనేది రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించేదన్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడమేంటని ప్రశ్నించారు. దీని ద్వారా తితిదేను తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఎంత మితృత్వం ఉన్నా, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కులు పోగొట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీయరాదని హితువు పలికారు. గోదావరి నీటి విషయంలో ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఒప్పుకోనందునే ఆర్టీసీ ఎండీని బదిలీ చేశారంటూ తీవ్ర స్థాయులో విమర్శలు చేశారు.ఇదీ చదవండి : వైకాపా అరాచకాలపై న్యాయస్థానాల్లో పోరాడుతాం