రేపల్లె పట్టణంలో పరిటాల యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. పరిటాల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైకాపా వ్యవహరిస్తోందని గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో స్కీమ్‌ల పేరుతో వైకాపా స్కామ్‌లు చేస్తోందని అనగాని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి పాల్పడి.. అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంపై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం సేకరించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు గ్రామ ప్రయోజనాలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికలు జరిగితే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని.. ఎన్నికల నిర్వహణకు తెదేపా సహకరిస్తుందని పేర్కొన్నారు. వైకాపా నేతలకు రాజ్యంగం, న్యాయ వ్యవస్థలపై నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో జరిగే అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు చేయిస్తున్నారని అనగాని మండిపడ్డారు.
ఇదీ చదవండి: దివంగత నేత పరిటాల రవికి ఘనంగా నివాళులు