దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుంటే వైకాపా నేతలు మాత్రం మద్యం స్టాక్ అవుట్ చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. విపత్కర పరిస్థితుల్లోనూ ఇసుక, మద్యంలో అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా లిక్కర్ విక్రయిస్తున్న ఎంతమందిపై కేసులు పెట్టారో ప్రభుత్వం బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్కు ముందు తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరకు నిల్వలపై నిగ్గు తేల్చాలన్నారు.
ఇదీ చూడండి: