సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించగా.. వారిని గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు. ఐదుగురు విద్యార్థి సంఘం నేతలను జైలు వద్ద తెదేపా నాయకులు పరామర్శించారు. విద్యార్థి సంఘ నేతలపై వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థుల సంక్షేమం కోసం టీఎన్ఎస్ఎఫ్ పోరాడటం నేరమా అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం విద్యార్థి సంఘం నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన వెంట తెదేపా నాయకులు కూరపాటి హనుమంతరావు , చదలవాడ అరవింద బాబు ఉన్నారు.
ఇదీ చూడండి: