ETV Bharat / state

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు విడుదల కోసం.. ఆలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు - AP Politics

TDP Leaders Protests Across the State Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకుపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మహిళలు ప్రత్యేకంగా పూజలుచేశారు.

tdp_leaders_protests
tdp_leaders_protests
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 5:08 PM IST

Updated : Sep 15, 2023, 7:44 PM IST

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు విడుదల కోసం.. ఆలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు

TDP Leaders Protests Across the State Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ మహిళ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష శిబిరాలను పోలీసులు తొలగించి అరెస్టులు చేస్తున్నప్పటికీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గటం లేదు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమన్న నేతలు ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

CID Sanjay AAG Ponnvolu : కృష్ణా, గంగా నదులు... నాసిక్‌లో పుట్టాయంట! సీఐడీ చీఫ్, ఏఏజీలు చెప్పారు..! పిల్లలూ నిజమేనా...?

Visakhapatnam: విశాఖలోని గోపాలపట్నం మసీదులో ముస్లింలతో కలిసి విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తన అనుచరులతో ప్రార్ధనలు నిర్వహించారు. శుక్రవారం ప్రార్ధనలన్నీ చంద్రబాబుని క్షేమంగా బయటకు తీసుకువస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Guntur: గుంటూరులో అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలంటూ గుంటూరులో ముస్లిం మైనార్టీల ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు తూర్పు ఇంచార్జి నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనల్లో మైనార్టీలు పాల్గొన్నారు. మంచి వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే సమాజం మొత్తం జైలులో ఉన్నట్లేనని ఖురాన్​లోని సూక్తిని ప్రస్తావించారు.

Palnadu District: పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Tirupati District: తిరుపతి జిల్లాలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రంగంపేట నుండి భీమవరం వరకు ఉన్న గ్రామస్థులు వారి వారి కులదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరంతా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటపడాలని ప్రతిపక్ష వైసీపీ పార్టీ వేసిన రాజకీయ మచ్చలు తొలగి నిర్దోషిగా బయటపడాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు.

IT Employees Protest Chandrababu Arrest : ఐటీ ఉద్యోగులకు షాక్.. ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు

Srikakulam District: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి చంద్రబాబు నాయుడు నిర్దోషిగా జైలు నుంచి తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించారు.

NTR District: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు గ్రామంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన దొంగ కేసులనుండి ఆయన బయటకి రావాలని స్థానిక గణపతి దేవాలయంలో పూజలు నిర్వహించి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టారు.

Krishna District: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కానూరు కెసీపీ నగర్​లోని సాయిబాబా ఆలయంలో పార్టీ రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తూ అభివృద్ధి పనులను పక్కనపెట్టి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nandamuri Rama Krishna Protest Initiation: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ, జనసేన నిరసన దీక్ష.. పాల్గొన్న నందమూరి రామకృష్ణ

Dr. BR Ambedkar Konaseema District: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మసీదులో ప్రార్థన చేశారు ఇక్కడ ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజక వర్గ పరిధిలో వున్న సాలూరు పట్టణంలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో టీడీపీ నేతలు పూజలు చేసి.. 108 కొబ్బరి కాయలు కొట్టారు. అక్రమ కేసులతో అరెస్టు అయిన బాబుకి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ పూజలు చేశారు. మక్కువ మండలం వెంకంపేట గ్రామంలో చంద్రబాబు అక్రమ‌ అరెస్డ్‌ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు భారీ సంఖ్యలో వైసీపీకి వ్యతిరేక నినాదాలు చేసి.. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. పాచిపెంట మండలంలో మారమ్మ తల్లి అమ్మవారి కొండపైన టీడీపీ, జనసేన శ్రేణులు భక్తిశ్రద్ధలతో టీడీపీ అధినేతకు బెయిల్​ రావాలని మారమ్మ తల్లిని మొక్కుకున్నారు.

Last Updated : Sep 15, 2023, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.