రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా నేతలు చెప్పారు. ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆ పార్టీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. కరోనా సోకిన వ్యక్తి ఫోన్ చేసిన అరగంటలో బెడ్ సిద్ధం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రజలకు మంచి వైద్యం అందించాలని కోరారు.

ఇవీ చదవండి