కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా నాయకులు 12 గంటల నిరాహార దీక్ష చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోతున్న నిరుపేద కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ. 5000 చెల్లించాలన్నారు. నిరాశ్రయుల కోసం అన్నా క్యాంటీన్లను తెరవాలని నినాదాలు చేశారు. సాయం ఎవరైనా చేయవచ్చునని దానికి అనుమతి పత్రాలతో పనిలేకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు గ్రామాల్లోన్ కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు.
ఇదీచూడండి.