గుంటూరు జిల్లాలో..
అమరావతి రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జైల్‌భరో కార్యక్రమానికి వెళ్లనీయకుండా.. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. పోలీసులు ప్రత్తిపాటి ఇంటి వద్ద మోహరించారు.
కృష్ణా జిల్లాలో..
ఎస్సీ, ఎస్టీ రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జైల్‌భరో కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను నేతలు ఖండించారు.
ఇవీ చదవండి: