ETV Bharat / state

ప్రజల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం: టీడీపీ నేతలు

TDP Leaders Allegations on CM Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ చేస్తున్న అరాచకాలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అబద్దాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.

tdp_on_jagan
tdp_on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 4:39 PM IST

TDP Leaders Allegations on CM Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పచ్చి అబద్ధాలు, భారీ మోసాలతో జగన్​మోసపు రెడ్డి విద్యాదీవెన పథకం అమలు అయిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. (Pattabhi Allegations on CM Jagan) మొత్తంగా జగన్​మోసపు రెడ్డి విద్యార్థి లోకానికి 3,400 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడని ఆరోపించారు. విద్యార్థులకు మేనమామనని చెప్పే జగన్ రెడ్డి వారి పాలిట కంసమామ అనడానికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసగించిన జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ఓటు అనే బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలపాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు.

అబద్దపు హామీల పునాదులపై కట్టిన వైసీపీ గోడలు కూలిపోతున్నాయి: టీడీపీ నేతలు

Devineni Uma Allegations on CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవ మోసాలయ్యాయని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి జగన్​పై ఆరోపణలు చేశారు. 730 హామీల్లో అమలయ్యింది 21 హామీలు అయితే పాక్షికంగా అమలయ్యింది 88 హామీలని అన్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 15 పర్సెంట్​తో ఫెయిలయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయానికి వస్తే ధాన్యం, ప్రత్తి మార్కెట్ యార్డ్​లలో దళారుల దోపిడీకి గురవుతుందని అన్నారు. నీళ్లు సమయానికి ఇవ్వకపోవడం వలన లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు నష్టపోయారని నిలదీశారు.

వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు వివరిస్తున్నారనే చంద్రబాబుపై అక్రమ కేసులు: టీడీపీ నేతలు

500 కోట్లకు పైగా ఖర్చుపెట్టి రిషికొండని బోడిగుండు చేశారని దుయ్యబట్టారు. విజయవాడ వచ్చే సింగపూర్ ఫ్లైట్​ని కూడా వైజాగ్ తరలించారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విశాఖ నుంచి సింగపూర్ పారిపోయి అక్కడి నుండి ఎక్కడికైనా వెళ్లిపోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకునే పనిలో జగన్​ ఉన్నాడని అన్నారు. అక్రమంగా దోచుకున్న కోట్ల రూపాయలను అక్రమంగా తన ప్యాలెస్​కు తరలిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో కోర్టు అధికారాలను తప్పించి ఒక అధికారి చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారని దేవినేని ఉమా అన్నారు.

వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం!

Achchennaidu Letter to DGP on BTech Ravi Security: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి భద్రత కల్పించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డీజీపీకి లేఖ రాశారు. బీటెక్ రవికి తొలగించిన భద్రతను పునరుద్దరించాలని కోరారు. 2006 నుంచి బీటెక్ రవికి భద్రత ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయిపై దాడి చేశారని అన్నారు. బీటెక్ రవికి ప్రాణ హాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.