ETV Bharat / state

అబద్దపు హామీల పునాదులపై కట్టిన వైసీపీ గోడలు కూలిపోతున్నాయి: టీడీపీ నేతలు

TDP Leaders Allegations on CM Jagan: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. అబద్దాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. విద్యార్ధుల జీవితాలతో జగన్ చెలగాటమాడుతున్నారని మొత్తం విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

_tdp_leaders_on_jagan
_tdp_leaders_on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 5:27 PM IST

Updated : Dec 29, 2023, 7:11 PM IST

TDP Leaders Allegations on CM Jagan: గిరిజన ద్రోహి జగన్ రెడ్డి’ అన్న పేరుతో కరపత్రాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(TDP state president Achchennaidu) విడుదల చేశారు. జగన్ పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాలను టీడీపీ కరపత్రంలో ప్రచురించింది. టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ధారు నాయక్, ఎస్టీ సెల్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్‌రెడ్డి పాలనలో గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవడమే కాకుండా వారికి రక్షణ కూడా కరువైందని పేర్కొన్నారు. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాలపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. అందులో తెలుగుదేశం హయాంలో జరిగిన గిరిజన సంక్షేమం, జగన్ రెడ్డి పాలనలో జరిగిన ద్రోహంతో పాటు ఇటీవల కేంద్ర నేరగణాంక సంస్థ విడుదల చేసిన లెక్కలను కరపత్రంలో ముద్రించారు.

వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం!

Yanamala Ramakrishnadu Allegations on Jagan: రానున్న ఎన్నికల సునామీలో వైసీపీ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అబద్దాలు, అసత్య ప్రచారాలు , మోసకారి హామీలతో కట్టిన వైసీపీ పునాదులు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి జగన్ రెడ్డికి వ్యతిరేక గాలి వీస్తోందని పేర్కొన్నారు. గౌరవం లేని చోట తాము ఉండలేమని వైసీపీ అభ్యర్థులు తేల్చి చెప్పేస్తున్నారని విమర్శించారు. వైనాట్ 175 అంటున్న జగన్ రెడ్డి పులివెందులలో కూడా గెలిచే పరిస్థితులు లేవని దుయ్యపట్టారు. జగన్ రెడ్డి అరాచకాలు, దుర్మార్గాలకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2024లో జగన్ రెడ్డిని గద్దె దించేందుకు అన్ని సామాజికవర్గాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ప్రజలు ఆదరిస్తున్నా జగన్ కనికరించట్లేదు: ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు

KS Jawahar Allegations on CM Jagan: అస్థవ్యస్థమైన విద్యా వ్యవస్థతో విద్యార్థుల జీవితాలతో సీఎం జగన్ రెడ్డి చలగాటమాడుతున్నారని మాజీ మంత్రి కే.ఎస్‌ జవహర్ ధ్వజమెత్తారు. బటన్‌ నొక్కుడు పేరుతో జగన్ రెడ్డి బడుగు బలహీన విద్యార్థుల పీకనొక్కుతున్నారని మండిపడ్డారు. జగన్‌ మెుదట ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ 11 లక్షల మందికి ఇచ్చి ఇప్పుడు 8 లక్షల మందికి తగ్గించి 3 లక్షల మంది విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి ఉందని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ రద్దు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేశారని దుయ్యబట్టారు. విద్యా దీవెన పేరుతో సాక్షికి ప్రకటనల రూపంలో దాదాపు 50 కోట్లు దోచిపెట్టారని జవహర్‌ ఆరోపించారు.

'జగన్​ మామయ్యా మాకు వద్దు ఈ ఉడకని, రుచిలేని భోజనం' - మధ్యాహ్న భోజనం అమలు దారుణం

MP Rammohan Naidu Allegations on CM Jagan: జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోయినా 99.5% పూర్తి చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు మద్యపానం నిషేధంపై మాట తప్పిన జగన్ ల్యాండ్​, శాండ్ దోచుకుంటున్న ఆర్థిక ఉగ్రవాది అంటూ ఎద్దేవా చేశారు, హామీలు అమలు చేయకపోవడం వలనే అంగన్వాడీ వర్కర్లు రోడ్లపైకి వచ్చే దుస్థితి వచ్చిందని ఇకనైనా జగన్ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మకుండా మేల్కొవాలని పిలుపునిచ్చారు.

Last Updated : Dec 29, 2023, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.