గుంటూరు జిల్లా మేడికొండూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్రెడ్డి విగ్రహం పెట్టేందుకు గుంత తీశారు. విగ్రహం పెట్టేందుకు ఎలాంటి అనుతులు లేవని తెలుసుకున్న తెలుగుదేశం అక్కడకు చేరుకొని పనులు ఆపేసింది. తెదేపా నాయకులు మాట్లాడుతూ... వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు రాత్రికి రాత్రే గుంత తీయటమేంటని ప్రశ్నించారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం చేస్తే... చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: నరసరావుపేట, కొటప్పకొండ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్,ఎమ్మెల్యే