సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని అందులో పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్
గురుమూర్తిని ముఖ్యమంత్రి తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్న చిత్రాన్ని.. ఆ పార్టీ ఫేస్బుక్ పేజీలో పెట్టి ఎస్సీల మనోభావాలను కించపరిచారని వర్ల ఆరోపించారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: