ETV Bharat / state

పుట్టినరోజు సందర్బంగా సీఎం జగన్​కు రూ 221 కోట్ల భారీ కానుక..

TDP PATTABHI ON TABS: పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్​కు ట్యాబ్​ల ద్వారా భారీ కానుక లభించిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ రాయితీతో రూ.11,999కి లభిస్తున్నా ప్రభుత్వం రూ.13,262 చెల్లించిందని ఆరోపించారు.

TDP PATTABHI ON TABS
TDP PATTABHI ON TABS
author img

By

Published : Dec 22, 2022, 10:13 AM IST

TDP PATTABHI ON TABS : విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందించిన ట్యాబ్‌ల ద్వారా సీఎం జగన్‌కు పుట్టినరోజు సందర్భంగా రూ.221 కోట్ల భారీ కానుక లభించిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ రాయితీతో రూ.11,999కి లభిస్తున్నా ప్రభుత్వం రూ.13,262 చెల్లించిందని ఆరోపించారు. ఒక్కో దానిపై అదనంగా రూ.1,263 కట్టబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నందున తక్కువలో తక్కువ ఒక్కోటి రూ.9 వేలకే లభించేదని.. కానీ జగన్‌ రూ.13,262 ధరకు చేసుకున్న లోపాయికారీ ఒప్పందం ద్వారా.. ఏకంగా రూ.221 కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు.

ట్యాబ్‌లో కంటెంట్‌ కోసం రేపోమాపో అస్తమించబోతున్న బైజూస్‌ తప్ప, మరే కంపెనీ దొరకలేదా? అని ప్రశ్నించారు. ఈ సంస్థ 1.2 బిలియన్‌ డాలర్ల అప్పు ఎగ్గొట్టిందని, దానిపై రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారని ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికలో రాశారని పేర్కొన్నారు. బైజూస్‌ 2020-21లో రూ.4,588 కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని.. నిరుడు 2,500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బైజూస్‌ బెదిరిస్తున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని కమిషన్‌ ఛైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో వెల్లడించారని తెలిపారు. కేవలం కమీషన్ల కోసమే సీఎం జగన్‌ ఆ సంస్థతో చేతులు కలిపినట్లు ఈ వ్యవహారం ద్వారా అర్థమవుతోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో వివిధ రకాల కంటెంట్ల రూపకల్పన కోసం కంటెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని మూసివేసి, డిజిటల్‌ కార్పొరేషన్‌గా మార్చేశారు. కంటెంట్‌ కార్పొరేషన్‌ అందుబాటులో ఉండి ఉంటే అవసరమైన కంటెంట్‌ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడానికి అవకాశం దక్కేదని పేర్కొన్నారు.

పుట్టినరోజు సందర్బంగా సీఎం జగన్​కు భారీ కానుక

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.