ముస్లిం మైనారిటీ నిధులు పక్కదారి పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మైనారిటీల సంక్షేమానికి కృషి చేయకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'మూడో వేవ్ వచ్చేలోగా టీకా ప్రక్రియ పూర్తిచేయాలి'