Julakanti: మాచర్లలో ప్రశాంత వాతావణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పార్టీ రహితంగా ఉండాల్సిన పోలీసులు వైసీపీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు. తమవరకు శాంతియుతంగా ఉంటామని, దాడి చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని స్పష్టంచేశారు. గత నెలలో జరిగిన ఘర్షణలపై కేసులు ఎదుర్కొంటున్న బ్రహ్మార్డెడ్డి సహా మిగిలిన తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్‌లో సంతకాలు పెట్టేందుకు గుంటూరు నుంచి మాచర్లకు తరలివెళ్లారు.
ఇవీ చదవండి: