గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై సంగం డెయిరీ ఛైర్మన్, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్.. ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. పదవితోనూ వ్యాపారం చేయవచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారని చెప్పారు. వినుకొండ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే తన పొలాలకు సమీపంలోకి మళ్లించారని ఆరోపించారు.
ఇదీ చదవండి: