ETV Bharat / state

కాకాణిని కాపాడేందుకే అనామకులను అరెస్ట్ చేశారు: ధూళిపాళ్ల

Dhulipalla Narendra: నెల్లూరు కోర్టులో చోరీ.. న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వేల కేసులు ఉన్న కోర్టులో కాకాణి కేసు పత్రాలే చోరీకి గురవ్వడం ఏంటని ప్రశ్నించారు.

author img

By

Published : Apr 18, 2022, 3:39 PM IST

Dhulipalla Narendra
ధూళిపాళ్ల నరేంద్ర
మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం

Dhulipalla Narendra: నెల్లూరు కోర్టులో చోరీ వెనుక పెద్దల హస్తముందని.. తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులో చోరీ.. న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని అన్నారు. చోరీపై పోలీసులు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసు కొనసాగితే కచ్చితంగా కాకాణికి జైలు శిక్ష తథ్యమన్నారు. ఈ ఘటనపై సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాకాణిని కాపాడేందుకే అనామకులను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

నెల్లూరు కోర్టులో చోరీ అనేది.. న్యాయవ్యవస్థకే మాయని మచ్చ. కోర్టులో గది తలుపులు పగలగొట్టి ఏం తీసుకోలేదంటున్నారు. కోర్టులో ఉన్న సాక్ష్యాలే చోరీకి గురయ్యాయంటే ఏం చెప్పాలి? ఎవరి ప్రమేయం లేకుండానే చోరీ జరిగిందా..? ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం లేకుండానే చోరీ జరిగిందంటారా..? వేల కేసులు ఉన్న నెల్లూరు కోర్టులో కాకాణి కేసు పత్రాలే చోరీకి గురయ్యాయి. మంత్రిగా ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే అనామకులను తీసుకొచ్చారు. న్యాయమూర్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. - ధూళిపాళ్ల నరేంద్ర

చోరీ కేసుకు.. ఏసీ మెకానిక్‌ షేక్‌ మహమ్మద్‌ మృతికి సంబంధం ఏంటో తెలియాలని ప్రశ్నించారు. మహమ్మద్‌ మృతిపై చాలా అనుమానాలున్నాయని, ఆఖరికి దొంగతనాలు చేయించే స్థాయికి వచ్చారంటే ఏమనాలని నిలదీశారు. ఐరన్‌ చోరీ కోసం వచ్చిన వాళ్లకు కోర్టు తాళాలు పగలగొట్టాల్సిన పనేంటని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదన్న ధూళిపాళ్ల.. కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి, సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిగితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని అన్నారు. కాకాణి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఇంత అరాచకమా? అని ధూళిపాళ్ల ధ్వజమెత్తారు. ఏడు కేసుల్లో కాకాణి ముద్దాయిగా ఉన్నారని.. సోమిరెడ్డి ప్రతిష్ఠ దిగజార్చాలని ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో కాకాణి గోవర్దన్‌రెడ్డి ఏ1గా ఉన్నారు. నెల్లూరు ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా..? కోర్టులో వేల కేసుల పత్రాలు ఉంటే.. కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా..? శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వక చోరీ. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానే ఈ చోరీ జరిగిందా? - ధూళిపాళ్ల నరేంద్ర

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.