గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధకు తెదేపా నాయకులు... కొందరు ప్రభుత్వ ఉద్యోగుల వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వాలంటీర్లు, మెప్మా ఉద్యోగస్థులు, కార్పొరేషన్ అధికారులు అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారని గుంటూరు తూర్పు నియోజవర్గం ఇంఛార్జ్ నసీర్ అహమ్మద్ ఆరోపించారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
'ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు'
"కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రతాప్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి" అని ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీఈఆర్టీ సంచాలకుడు ప్రతాప్ రెడ్డి.. ఎన్నికల శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని.. ఆయన భార్య కల్పలత రెడ్డికే ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: