All party leaders fire on AP Sarkar GO No.1: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీతో వైకాపాకు ఓటమి భయం పట్టుకుందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అందుకే బాబు-పవన్ కలిసిన కాసేపటికే మంత్రులు వరుసపెట్టి ప్రెస్‌మీట్లు పెట్టారని.. తెలుగుదేశం, జనసేన సహా ఇతర పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు. రాక్షస పాలన అంతానికి కలిసి పోరాడితే తప్పంటేని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు - పవన్ కలిసి కాఫీ తాగితేనే, 12 మంది మంత్రులు స్పందించారంటే.. వైకాపా ఎంతగా భయపడుతుందో అర్థమవుతోందని తెలుగుదేశం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. ఏ ఇద్దరూ కలవకూడదని జీవో నెంబర్-2 తెస్తారేమో అంటూ ఎద్దేవా చేసింది. వైకాపా అరాచకాలపై పోరాటం చేసేందుకు చంద్రబాబు, పవన్ కలిసి మాట్లాడుకుంటే తప్పేంటని ఆ పార్టీ నేతలు నిలదీశారు.
కుప్పంలో పోలీసుల అరాచకాలపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ వెళితే.. వైకాపా నాయకులకు ఉలికిపాటు ఎందుకని జనసేన నేత కందుల దుర్గేష్ ప్రశ్నించారు. వైకాపా నేతల ఆందోళన చూస్తుంటే.. ఓటమి భయం పట్టుకున్నట్లు ఉందన్నారు.
చంద్రబాబు - పవన్ సమావేశం తర్వాత డైపర్లకు డిమాండ్ పెరిగిందని.. వైకాపా నేతలను ఉద్దేశించి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. తమకేమీ భయం లేదంటూనే.. వైకాపా నేతలు అతిగా స్పందించాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. వైకాపాను ఓడించాలంటే రాష్ట్రంలో అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విపక్షాల అణచివేతే లక్ష్యంగా రోడ్ షోలను నిషేధిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1ను.. పండుగ రోజు భోగి మంటల్లో వేస్తామని రామకృష్ణ చెప్పారు.
కుక్కలు ఏ విధంగా మొరిగాయో దానికి, దీనికి ఏమన్నా తేడా ఉందని నేను అనుకోవటం లేదు. ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకుంటే అసలు ఒక ప్రణాళికా లేకుండా ప్రతి అయిదు నిమిషాల వ్యవధిలో ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి, గ్యాప్ లేకుండా ఒకదాని వెంట మరొకటి ఎలా మొరిగాయో అలా మొరిగినారు నిన్న. ఎందుకు మీకూ అంతలా తడిసిపోతుంది కింది నుంచి పైదాకా..-నక్కా ఆనంద్ బాబు, తెదేపా నేత
ఇవీ చదవండి