ETV Bharat / state

రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్‌ నాశనం చేశారు: అచ్చెన్నాయుడు - టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

TDP Atchannaidu Fires on YCP Govt: రాబోయే ఎన్నికలు వైసీపీకి, రాష్ట్రంలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్‌ నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబు సమక్షంలో వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

tdp_Atchannaidu_fires_on_ycp_govt
tdp_Atchannaidu_fires_on_ycp_govt
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 5:33 PM IST

TDP Atchannaidu Fires on YCP Govt: తెలుగుదేశంలోకి వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరారు. ఎన్టీఆర్ భవన్​లో అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతినగరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

రాష్ట్ర పేరు ప్రతిష్టల్ని సైకో దేశ వ్యాప్తంగా నాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇక సైకో జగన్ పనైపోయిందన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా తెలుగుదేశం - జనసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తేల్చిచెప్పారు. యువగళం-నవశకం సభ ద్వారా ప్రజా చైతన్యం వెల్లువిరిసిందన్నారు. అధికారం మార్పు ఎప్పుడెప్పుడా అని ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారని ఉద్ఘాటించారు.

నారా లోకేశ్ యువగళం - నవశకం సభ జరగకుండా చేయాలని సీఎం జగన్ అనేక ఇబ్బందులు పెట్టాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి సభను విజయవంతం చేశారని అన్నారు.

తెలుగుదేశం పార్టీలోకి వలసలు - కిక్కిరిసిన ఎన్టీఆర్​ భవన్ - చంద్రబాబు సమక్షంలో చేరికలు

ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం మాత్రమే ఉందని, కాబట్టి కార్యకర్తలు, నాయకులు ప్రతి నిమిషం ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి నిమిషం కష్టపడి పనిచేసి రాష్ట్రంలో తెలుగుదేశం - జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికలు వైసీపీకి, టీడీపీ - జనసేనకు మధ్య జరగడం లేదని అన్నారు. ఈ ఎన్నికలు వైసీపీకి, రాష్ట్రంలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. సైకో జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అని ప్రాంతాల వారు నరకం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి అధికారులు సైతం ఈ ప్రభుత్వం ఎప్పుడు మారుతుంది అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

Joinings in Telugu Desam Party : జగన్ రాక్షస పాలనను అంతమొందిస్తేనే కడప గడపల్లో స్వేచ్ఛ: నారా లోకేశ్

రాష్ట్ర ప్రజలంతా టీడీపీ - జనసేన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని అచ్చెన్న మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, చివరికి సోషల్ మీడియాలో షేర్ చేసినా సరే అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్​లో అధికారులను చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని, రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

రాష్ట్ర మంచి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేద్దామని అన్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని, టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని టీడీపీ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. అదే విధంగా పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

లోకేశ్ వారసుడు కాదు రాజకీయ నాయకుడని ఆరోజే చెప్పా : అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.