గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్త పిల్లి కోటిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబును.. తిరుపతి విమానాశ్రయంలో నిర్భందించటాన్ని తప్పుపడుతూ సామాజిక మాధ్యమాల్లో పిల్లి కోటి పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు సీఎంను కించపరిచేలా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం.. గత అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. పిల్లి కోటి అరెస్టును నిరసిస్తూ..చిలకలూరిపేట పోలీసు స్టేషన్ వద్ద తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కోటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని స్థానిక సీఐను ఆదేశించారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ..పోలీసులు వైకాపా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాణిక్యాలరావులు మండిపడ్డారు .
ఇదీచదవండి
నాకెవరితో విభేదాల్లేవ్.. నేను వెళ్లే దారి వాళ్లకు నచ్చకపోవచ్చు: కేశినేని నాని