తూర్పుగోదావరి జ్లిల్లా తుని నుంచి తమిళనాడులోని మధురైకి నుంచి టాటా వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. తుని నుంచి పనస కాయలతో వస్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు అందులో 100కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి బాల సుబ్రమణియన్, సెల్వనారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు..
ఇది చదవండి కరోనా మరణాన్ని తప్పించే ఔషధం ఇదే!