ETV Bharat / state

"పింఛన్‌ ఇప్పించండి.. ప్లీజ్‌".. తైక్వాండో క్రీడాకారుడి దీనగాథ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

TAEKWONDO PLAYER: ఐదేళ్లకే తైక్వాండో క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. పదేళ్లకే పతకాల వేట ప్రారంభించాడు. 12 ఏళ్లు వచ్చేసరికి రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక పతకాలు గెల్చుకున్నాడు. క్రీడాకారుడిగా ఉన్నతస్థాయికి చేరతాడనుకున్న కన్నవారి ఆశల్ని వమ్ము చేస్తూ.. ఊహించని విధంగా కదల్లేని స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. ప్రభుత్వం ఇచ్చే పింఛను కోసం దీనంగా ఆర్థిస్తున్నగుంటూరు నిరుపేద కుర్రాడిపై "ఈటీవీ- ఈటీవీ భారత్​" ప్రత్యేక కథనం

TAEKWONDO PLAYER
TAEKWONDO PLAYER
author img

By

Published : Jul 20, 2022, 12:16 PM IST

"పింఛన్‌ ఇప్పించండి.. ప్లీజ్‌".. తైక్వాండో క్రీడాకారుడి దీనగాథ

TAEKWONDO PLAYER: గుంటూరు నగరంలోని ప్రగతి నగర్‌కు చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, రాములమ్మ కుమారుడైన శ్రీహరికి.. చిన్నప్పుడే తైక్వాండోపై ఆసక్తి కలిగింది. కూలీపనే ఆధారమైనా కుమారుడి ఆసక్తిని కాదనలేక.. ఖాదర్ భాషా అనే కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు. శ్రీహరి సైతం నిరంతర సాధనతో తైక్వాండోలో విశేషంగా రాణించాడు. ఈ క్రమంలో శ్రీహరి చేసిన చిన్న తప్పు అతడి జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.

శ్రీహరి వైద్యం కోసం అనేక ఆసుపత్రులు తిరిగినా, లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన ఎలాంటి ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లినా, కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినా.. సాంకేతిక కారణాల సాకుతో పింఛన్‌ కూడా మంజూరు చేయడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. 8 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమ కుమారుడి వైద్యానికి సహాయం చేయాలని, కనీసం పింఛన్‌ అయినా ఇప్పించాలని శ్రీహరి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.