రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఆటోలు, క్యాబ్‌లలో నిర్భయంగా ప్రయాణించడం కోసం 'అభయం' యాప్‌ను తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఈ చర్యలతో ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని శ్రీదేవి చెప్పారు. అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు డిసెంబర్ 25న ఇవ్వబోతున్న ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: