ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా నుంచి త్వరగా విముక్తి కలగాలని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించారు. చివరి రోజు దుర్గమ్మ విజయ స్వరూపిణైన రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కనిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. పార్టీ నాయకులు, జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్, సెంట్రల్ ఆంధ్రా పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు అమ్మిశెట్టి వాసు, పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే