గుంటూరు జిల్లా కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకిన బాలికను వెంటనే ఉపాధ్యాయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. తన కుటుంబాన్ని గణిత ఉపాధ్యాయురాలు కించపరుస్తూ మాట్లాడిందని అందుకే మనస్తాపంతో ఆత్మహత్యయత్నం చేసుకున్నానని విద్యార్థిని తెలిపింది. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆస్పత్రికి చేరుకుని బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఉపాధ్యాయురాలని విధులు నుంచి తొలగించాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: