2012-2014 బ్యాచ్‌కు చెందిన 1759 మంది వీఆర్వోలకు ఇప్పటివరకు పదోన్నతులు ఇవ్వలేదని.. ఏపీ వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలని గుంటూరులో కోరారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ప్రభుత్వ తమ సమస్యలు పరిష్కరించలేదన్నారు.
వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వోలకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి దగ్గర... వీఆర్వో లను కన్వీనర్‌గా నియమించి వారిని డీ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్వోలకు కనీస సదుపాయాలు లేవన్నారు.
ఇదీ చూడండి: