అభివృద్ధికి కావాల్సింది రాజధానులు కాదు..హోదా: శైలజానాథ్ - latest news of congress metting in guntur
ముఖ్యమంత్రి చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... వైకాపా తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని... మూడు రాజధానులు కాదని అభిప్రాయపడ్డారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్... హోదా కోసం 23 మంది ఎంపీలున్నా ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్
TAGGED:
latest news of silajanath