కరోనా అప్రమత్తతపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇప్పటివరకు సేకరించిన 11 మంది నమూనాలు నెగటివ్ వచ్చాయని చెప్పింది. విదేశాల నుంచి వచ్చిన 8 మంది నమూనాలను పుణెకు పంపినట్లు పేర్కొంది. సింగపూర్, బహ్రెయిన్ నుంచి వచ్చిన ఐదుగురికి విశాఖ ఛాతి ఆస్పత్రిలో... దక్షిణకొరియా నుంచి వచ్చిన వ్యక్తికి కాకినాడ ఆస్పత్రిలో... జర్మనీ ప్రయాణికుడికి విజయవాడ ఆస్పత్రి ఐసొలేషన్ వార్డులో... మస్కట్ నుంచి వచ్చిన వ్యక్తికి ఏలూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
అన్ని ఆసుపత్రుల్లో రక్షణ కిట్లు సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మందులు, రక్షణ కిట్లు, ఎన్95 మాస్కులు అందుబాటులో ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేశామని... 24 గంటలు నిరంతరాయంగా పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటుతో పాటుగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.
ఇదీ చదవండి: