SRM University AP Faculty: 2023 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా నూతన పరిశోధనలు, ఆవిష్కరణలను చేసిన టాప్ 2% శాతం శాస్త్రవేత్తల పేర్లను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురికి స్థానం లభించింది. తమ విశ్వవిద్యాలయానికి చెందిన ఐదుగురికి స్థానం లభించడం పట్ల.. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మనోజ్ కె. అరోరా ఆనందం వ్యక్తం చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చెందిన డాక్టర్ రంగభాషియం సెల్వ సెంబియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ రణధీర్ కుమార్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ క్షీర సాగర్ సాహూ, డాక్టర్ దివ్య చతుర్వేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కు చెందినవారు.. టాప్ 2% శాస్త్రవేత్తలలో ఉన్నారని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ తెలిపింది.
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం బోర్డుపై అమరావతి తొలగింపు.. ఎందుకంటే..!
అంతర్జాతీయంగా తమ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులకు గుర్తింపు రావడం పట్ల వైస్ ఛాన్సలర్ మనోజ్ కె. అరోరా హర్షం వ్యక్తం చేశారు. తమ ఫ్యాకల్టీని అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ జర్నల్స్‌లో ఫ్యాకల్టీ పరిశోధన పత్రాలు, వారి రచనలు ప్రచురించాయని తెలిపారు. అధ్యాపకులు సాధించిన విజయాలు ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీకి పేరు తెచ్చిందని తెలిపారు. తద్వారా తమ యూనివర్సిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ మెరుగైన ఫలితాలు పొందుతున్నట్లు తెలిపారు. ఈ గుర్తింపు రావడం వల్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. ఈ ర్యాంకింగ్‌తో తమకు ప్రపంచ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా తమ యూనివర్సిటీకి, తమ పరశోధనలకూ మంచి గుర్తింపు లభిస్తుందని డాక్టర్ రంగభాషియం పేర్కొన్నారు.
APSRMU Request to ISRO: అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో సహకారాన్ని కోరిన ఎస్‌ఆర్‌ఎంయూ
అధ్యాపకులు ఆయా విభాగాలలో చేసిన పరిశోధనల పురోగతి వల్లే ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఎనర్జీ అండ్ బయోటెక్నాలజీ రంగంలో డాక్టర్ కార్తీక్ విశేషమైన కృషి చేశారని తెలిపారు. ఎర్త్ & ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విభాగంలో డాక్టర్ రంగభాష్యం చేస్తున్న పరీశోధనలకు ఈ గుర్తింపు పొందారు. డాక్టర్ రణధీర్, డాక్టర్ క్షీర, డాక్టర్ దివ్య ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీస్‌లో చేస్తున్న పరీశోధనలకు గాను గుర్తింపు లభించిందని యూనివర్సీటి తెలిపింది. 2022 ప్రకటించిన జాబితాలో సైతం ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు అధ్యాపకులను చోటు లభించిందని తెలిపారు. 2023 పరిశోధన, నూతన ఆవిష్కరణలకు గాను జాబితాలో ఐదుగురు అధ్యాపకులకు చోటు లభించిందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. రాబోయే కాలంలో మరింత మంది అధ్యాపకులు గుర్తింపు పొందుతారని వైస్ ఛాన్సలర్ మనోజ్ కె. అరోరా ఆశాభావం వ్యక్తం చేశారు.