రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి మరో 2 నెలల్లో అదుపులోకి వచ్చే అవకాశముందని.. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్యయనంలో తేల్చారు. యూనివర్సిటీ వీసీ డి.నారాయణరావు ఆధ్వర్యంలో.. ప్రొఫెసర్ సౌమ్యజ్యోతితో పాటు మరో నలుగురు విద్యార్థులు కలిసి ఈ స్టడీ నిర్వహించారు. అంతర్జాతీయంగా పేరొందిన ఎస్ఎస్ఐఆర్ విధానంలో.. ప్రస్తుతం ఏపీలో ఉన్న కరోనా పరిస్థితులు, గణాంకాలను సమీక్షించారు. తదనుగుణంగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథం డేటాను తయారు చేశారు. కొవిడ్ వ్యాప్తి ముగిసే సమయాన్ని అంచనా వేస్తూ.. శాస్త్రీయంగా నివేదికను రూపొందించారు. వైరస్ వ్యాప్తి, వేగం, తీవ్రతతో పాటు రికవరీ వివరాలను అందులో పొందుపర్చారు.
ఇదీ చదవండి: 'మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు సీఎం అవుతా'
కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వం రోజువారీ వెల్లడిస్తున్న కొవిడ్ కేసులు, రికవరీ డేటాను.. ఎస్ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానం చేసి నివేదిక రూపొందించినట్లు యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను ఇందులో విశ్లేషించారు. ఆ ప్రకారం మే 21 నాటికి ఏపీలో 10 వేలు, మే 30 నాటికి 5 వేలు, జూన్ 14 నాటికి 1000, జూన్ చివరి నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.
జులై 15 నాటికి ఏపీలో 100 కంటే తక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నివేదికను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు మెయిల్ ద్వారా పంపించినట్లు వీసీ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు అన్వేష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సాయికృష్ణ, సుహాసిరెడ్డి ఈ అధ్యయంలో పాల్గొన్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: