ETV Bharat / state

శ్రీలక్ష్మిపై హైకోర్టు వ్యంగ్యాస్త్రం... ఆమే 'సిన్సియర్‌' సీనియర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అంటూ.. - AP News

రాజధాని వ్యాజ్యాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి వేసిన అనుబంధ పిటిషన్‌లను హైకోర్టు కొట్టేసింది. ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి వైదొలగాలని కోరుతూ శ్రీలక్ష్మి వ్యాజ్యాలు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం... సిన్సియర్‌ సీనియర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అధికారి... నిజాయతీగా విధి నిర్వహణలో భాగంగా ఈ అనుబంధ పిటిషన్‌ వేశారని వ్యంగ్యాస్త్రం విసిరింది.

AP Special chief secretary Srilakshmi on capital cases in HC

author img

By

Published : Mar 4, 2022, 4:21 AM IST

రాజధాని వ్యాజ్యాలపై ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి వైదొలగాలని కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరితమైన సిన్సియర్ సీనియర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అధికారి, శ్రీలక్ష్మి నిజాయతీగా విధి నిర్వహణలో భాగంగా ఈ అనుబంధ పిటిషన్‌ వేశారని వ్యంగ్యంగా స్పందించింది. అమరావతి ప్రాంతంలో ఇద్దరు న్యాయమూర్తులకు ఇంటి స్థలాలు ఉన్నాయని, వ్యాజ్యాల్లో వచ్చే నిర్ణయం ఆధారంగా ఆ భూముల విలువ పెరగడం లేదా తగ్గే అవకాశం ఉందన్న కారణంతో విచారణ నుంచి వైదొలగాలని పిటిషన్‌లో పేర్కొన్నారని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఆర్థిక ప్రయోజనాలు పొందారనేది ప్రధాన కారణంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. అయితే స్థలాలకు మార్కెట్‌ విలువ చెల్లించి ఆ ఇద్దరు న్యాయమూర్తులు కొనుగోలు చేశారని తెలిపింది. వీరిద్దరికీ మాత్రమే ఇళ్ల స్థలాలను రాయితీ ధరకు ఇవ్వలేదని మొత్తం 14 మంది జడ్జీలకు మార్కెట్‌ విలువ చెల్లింపునతో ఇచ్చారని గుర్తు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారం 14 మంది న్యాయమూర్తులకు విక్రయ దస్తావేజులు రాశారని తెలిపింది.

పరిపాలన కమిటీ నిర్ణయాన్ని ఆమోదించిన పుల్‌ కోర్టు...

2018లో అప్పటి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి... హైకోర్టు జడ్జిలకు, న్యాయాధికారులకు, హైకోర్టు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో హైకోర్టుకు లేఖ రాశారు. ఆ ప్రతిపాదనకు హైకోర్టు పరిపాలన కమిటీ ఆమోదం తెలిపింది. పరిపాలన కమిటీ నిర్ణయాన్ని పుల్‌ కోర్టు ఆమోదించింది. తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో సామాజిక వాతావరణం సృష్టించాలన్న ఉద్దేశంతో ఉద్యోగులకు న్యాయాధికారులకు, మీడియా ప్రతినిధులకు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ధర్మాసనం తెలిపింది. ఇళ్ల స్థలం కొనుగోలు చేసిన 15 ఏళ్ల పాటు విక్రయించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజధాని వ్యాజ్యాలపై తీర్పు వెల్లడించినా ఇప్పటికిప్పుడు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశమే లేదని స్పష్టం చేసింది.

జీతాలిచ్చినంత మాత్రానా అందులో ఆర్థిక ప్రయోజనం ఉండదు...

హైకోర్టు జడ్జిలు రాజ్యాంగబద్ధ విధులు నిర్వరిస్తారన్న ధర్మాసనం... విధులను నిర్వర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. నివసించే ఇళ్లు, వినియోగించే కార్లతో పాటు తీర్పులపై సంతకాలు చేసేందుకు ఇచ్చే పెన్నులకూ ప్రభుత్వమే సొమ్ము ఇస్తుందని స్పష్టం చేసింది. జీతాలనూ ఇస్తుందని గుర్తు చేసింది. సౌకర్యాలు కల్పించి, జీతాలిచ్చినంత మాత్రానా అందులో ఆర్థిక ప్రయోజనం ఉందని పేర్కొనడాన్ని అంగీకరించలేమంది. అలా అనుకుంటే... ఏ జడ్జీ విధులను ప్రభావవంతంగా నిర్వర్తించలేరని వివరించింది. కోర్టుల నిర్వహణకు ఆర్థిక వనరులు సమాకూర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఇద్దరు జడ్జిలపై ఆరోపణ చేస్తూ విచారణ నుంచి వైదొలగాలని కోరడం ప్రధాన న్యాయమూర్తి అధికార విధుల్లో జోక్యం చేసుకోవడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంలోకి చొచ్చుకుని రావడమేనని అభ్యంతరం తెలిపింది.

ఇది సిగ్గమాలిన ప్రయత్నమే..

రాజధాని వ్యాజ్యాల విచారణ కోసం అప్పటి సీజే జేకే మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్‌లో జస్టిస్‌ సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఇచ్చిన ఉత్తర్వులను... ప్రభుత్వం అభ్యంతరం తెలపలేదు. ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి వైదొలగాలని కోరడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనని హైకోర్టు తెలిపింది. ఇది సిగ్గమాలిన ప్రయత్నమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విచారణ నుంచి వైదొలగాలంటూ ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.

ఇదీ చదవండి: CM Jagan Review: ఇప్పుడేం చేద్దాం?.. హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.