ETV Bharat / state

అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన అనూష హత్య కేసు వివరాలను ఎస్పీ విశాల్‌ గున్నీ వివరించారు. వేరే యువకునితో చనువుగా ఉందనే కారణంగా నిందితుడి ఆమెను హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్‌ గున్నీ
అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్‌ గున్నీ
author img

By

Published : Feb 26, 2021, 2:51 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈనెల 24వ తేదీన జరిగిన అనూష హత్య సంచలనం సృష్టించింది. కృష్ణవేణి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నఅనూషను సహ విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డే హత్యే చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని ఈ రోజు గుంటూరులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారితీసిన పరిణామాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. విష్ణువర్థన్ రెడ్డి అనూషను ప్రేమిస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో అనూష మనోజ్ అనే మరో యువకునితో మాట్లాడటాన్ని విష్ణు జీర్ణించుకోలేకపోయాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీశాడు.

accused vishnu vardhan reddy
నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి

ఈనెల 24వ తేదీన నరసరావుపేట నుంచి అనూషను పాలపాడు సమీపంలోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని... ఈ క్రమంలో విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహంతో అనూషను కింద పడేసి... గొంతు నులిమి చంపేశాడని ఎస్పీ వివరించారు. అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని శవాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు విషయం తెలియటంతో విష్ణువర్థన్ రెడ్డి స్వయంగా స్టేషన్​కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన చాలా దారుణమైందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరిపారని... అన్ని ఆధారాలు కోర్టుకు నివేదిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరతామని... ముద్దాయికి శిక్ష పడేలా చూస్తామని వివరించారు.

అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్‌ గున్నీ

అనూష హత్యతో నరసరావుపేటలో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూడా రోడ్డెక్కాయి. దీంతో ప్రభుత్వం, పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అనూష కుటుంబానికి 10లక్షల రూపాయల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనూష తల్లి వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించటంతో పాటు... నిందితుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు 48 గంటల్లోనే ఛార్జిషీట్ నమోదు చేశారు.

ఇదీ చదవండీ.. ప్రేమ తీసిన ప్రాణం.. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.