గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. కుల, మతాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో అక్కడ కృష్ణవేణి కళాశాల ఉండేదని... రెండున్నరేళ్ల కిందట తరలింపు సమయంలో విగ్రహం దెబ్బతిందని ఎస్పీ వివరించారు.
ఉద్దేశపూర్వకంగా దానిని పగులగొట్టి... మద్యం పోశారని సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసేముందు ఒకటికి రెండుసార్లు వాస్తవాలను నిర్ధారించుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని.. మరో వ్యక్తికి నోటీసులు జారీచేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండీ